వైసీపీ నేతల్లో అంతర్మధనం
◆ విమర్శలకు దారి తీస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం
◆ పార్టీ శ్రేణుల్లో అసమ్మతిరాగం
◆ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా జగన్ నిర్దేశించిన లక్ష్యాలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావటంతో ఇక, ఎన్నికల వరకు ఎమ్మెల్యేలతో సహా పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు. కానీ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యాలు ఎమ్మెల్యేలను ఇరుకుని పెట్టేలా ఉన్నాయని గుసగుసలు వినపడుతున్నాయి. జగన్ అధ్యక్షతన జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. గత నెల నుంచి ప్రాంతీయ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎమ్మెల్యేలతో జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధినేత లక్ష్యాలు మితిమీరిన దిశ నిర్దేశాలతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో అసమ్మతి పెరుగుతోంది. ఇప్పటికే రెండో విడతలో మంత్రి పదవి ఆశించి కొందరు భంగపాటుకు గురవగా మరికొందరిని తిరిగి కొనసాగించకపోవడంతో అలక వహించారు. వారంతా పార్టీ అధిష్టానంతో అంటి అంటున్నట్లు వ్యవహరిస్తున్నారు. కానీ జగన్ నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం సదస్సుకు మాత్రం బుద్ధిగా హాజరవుతున్నారు.
ఇప్పటివరకు జరిగిన రెండు సదస్సుల లక్ష్యం చూస్తే రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. పూర్తిగా సంక్షేమం పైన దృష్టి పెట్టి అభివృద్ధిని విస్మరించేలా ఉందని ఇప్పటికే ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. మూడేళ్లు గడిచిన తర్వాత ఎమ్మెల్యేలకు రెండు కోట్లు చొప్పున కేటాయించారు. ఇప్పటివరకు వారికి నిధులు అధికారాలు లేవు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలతో ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య పూర్తి సంబంధాలు తెగిపోయాయి. అంతా సచివాలయ వ్యవస్థతోనే సంక్షేమం కొనసాగుతుంది. దీనిపైన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటంతో పాటు తాము ఒక అలంకారప్రాయమేనని వారు వాపోతున్నట్లు సమాచారం. గత సదస్సు కంటే రెండోసారి జరిగిన సదస్సులో జగన్ లక్ష్యాలు పెంచడం ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా రానున్న నెల రోజుల్లో ఏడు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని ఆగస్టులో కనీసంగా 16 రోజులు గరిష్టంగా 21 రోజులపాటు పాల్గొనాలంటూ ఆదేశించడం పై వారి గుర్రుగా ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సమిష్టిగా ఎవ్వరూ తిరగటం లేదు. సీఎం ఆదేశాల మేరకు మొక్కుబడిగా ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. పేరుకు మాత్రం కలిసి కష్టపడదాం అంటున్న వైయస్ జగన్ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోతే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఉండవు అని పరోక్షంగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్తు ఏమిటనేది అంతు చిక్కటం లేదు. రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్లు వస్తాయా లేదా అని ప్రశ్నార్ధకంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో జగన్ వైఖరి ఎలా ఉండబోతుంది గడపగడపకు ప్రభుత్వం సక్సెస్ అవుతుందా లేదా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వస్తాయా అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇప్పటివరకు జరిగిన రెండు సదస్సుల లక్ష్యం చూస్తే రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. పూర్తిగా సంక్షేమం పైన దృష్టి పెట్టి అభివృద్ధిని విస్మరించేలా ఉందని ఇప్పటికే ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. మూడేళ్లు గడిచిన తర్వాత ఎమ్మెల్యేలకు రెండు కోట్లు చొప్పున కేటాయించారు. ఇప్పటివరకు వారికి నిధులు అధికారాలు లేవు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలతో ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య పూర్తి సంబంధాలు తెగిపోయాయిశ అంతా సచివాలయ వ్యవస్థతోనే సంక్షేమం కొనసాగుతుంది. దీనిపైన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటంతో పాటు తాము ఒక అలంకారప్రాయమేనని వారు వాపోతున్నట్లు సమాచారం. గత సదస్సు కంటే రెండోసారి జరిగిన సదస్సులో జగన్ లక్ష్యాలు పెంచడం ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా రానున్న నెల రోజుల్లో ఏడు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని ఆగస్టులో కనీసంగా 16 రోజులు గరిష్టంగా 21 రోజులపాటు పాల్గొనాలంటూ ఆదేశించడం పై వారి గుర్రుగా ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సమిష్టిగా ఎవ్వరూ తిరగటం లేదు. సీఎం ఆదేశాల మేరకు మొక్కుబడిగా ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. పేరుకు మాత్రం కలిసి కష్టపడదాం అంటున్న వైయస్ జగన్ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోతే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఉండవు అని పరోక్షంగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్తు ఏమిటనేది అంతు చిక్కటం లేదు. రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్లు వస్తాయా లేదా అని ప్రశ్నార్ధకంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో జగన్ వైఖరి ఎలా ఉండబోతుంది గడపగడపకు ప్రభుత్వం సక్సెస్ అవుతుందా లేదా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వస్తాయా అనేది వేచి చూడాల్సి ఉంది.