లోకేష్ కంటే పవనే సమర్ధుడు
లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలిసారిగా స్పందించారు. టీడీపీ నేతలు లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వేదికల మీద,మీడియా ముందు అభిప్రాయాలను వ్యక్తీకరించడం సరికాదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మరో వ్యక్తికి అదే పదవి ఇవ్వాలనే డిమాండ్ కూటమిలో విభేదాలకు దారితీస్తుందన్నారు. లోకేష్ కష్టపడి పనిచేశారని దానికి తగ్గట్టుగానే ఆయనకు సముచిత మంత్రి పదవి లభించిందన్నారు.ఇలా వ్యాఖ్యానించడం ద్వారా… లోకేష్ కంటే డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణే అర్హుడంటూ బుచ్చయ్య పరోక్షంగా వ్యాఖ్యానించారని పొలిటికల్ హబ్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి.

