ఫిలిప్పీన్స్‌లో పఠాన్ చెరు యువతి మృతి
వైద్య విద్య కోసం ఖండాంతరాలు దాటి వెళ్లిన హైద్రాబాద్ యువతి శవంగా మారింది తల్లిదండ్రులకు తీరని క్షభను మిగిల్చిన ఘటన శుక్రవారం జరిగింది. పఠాన్ చెరు మండలం ఇంద్రేశంలో నివశించే స్నిగ్థ అనే యువతి ఫిలిప్పీన్స్‌లో లో ద్వితీయ సంవత్సరం వైద్యవిద్యనభ్యసిస్తుంది. గురువారం అనుమనాస్పద స్థితిలో మృతి చెందింది.దీనిపై ఆదేశ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా స్నిగ్ధ మృతితో ఇంద్రేశంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

