Andhra PradeshHome Page SlidermoviesNews Alert

ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్న బాలకృష్ణ

నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ నుండి హీరో బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డునందుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి బాాలకృష్ణ అల్లుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా హాజరుకానున్నారు. కేంద్రప్రభుత్వం జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. చిన్నప్పుడే చిత్రాలలో నటించడం మొదలుపెట్టిన బాలకృష్ణ ఇటీవలే తన సినీ జీవితంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకున్నారు. తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని పేర్కొన్నారు. ఇటీవల అఖండ, డాకు మహరాజ్ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించారు. అలాగే క్యాన్సర్ రోగుల కోసం తన తల్లి పేరుతో ఏర్పాటయిన బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌గా రోగులకు సేవలందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో పేదలకు ఉచిత క్యాన్సర్ చికిత్సను కూడా అందిస్తున్నారు.