Home Page SliderPoliticsTelangana

కేసీఆర్‌ అహంకార పాలన అంతం చేయడమే మన ఎజెండా

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా బీజేపీ ఇంఛార్జి nvss ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..  కేసీఆర్‌కి తెలంగాణ నినాదంతో బంధాలు తెగిపోయాయన్నారు. భారత్ మాతాకీ జై అనేది ఎంత ముఖ్యమో…తెలంగాణలో జై తెలంగాణ కూడా అంతే ముఖ్యమన్నారు. మానుకోటలో తెలంగాణ ఉద్యమ కారుల మీద రాళ్ళు వేసి.. మా రక్తాన్ని చూసిన వారు కెసిఆర్ చంకన చేరారన్నారు. ఆయన పక్కన తెలంగాణ ద్రోహులు ఉన్నారు కానీ తెలంగాణ పేరు ఎత్తడానికి సిగ్గుపడుతున్నారన్నారు. అందుకే TRS పోయి BRS వచ్చిందని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అహంకార పాలన అంతం చేయడమే మన ఎజెండా అని పిలుపు నిచ్చారు.

నాకు చేసిన అవమానాలు అన్నీ వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుంది కెసిఆర్ అని ఈటల ఘాటుగా విమర్శించారు. ఆంధ్ర పోయి ఆంధ్రా మాట్లాడాలి, కర్ణాటక పోయి కన్నడ మాట్లాడాలి, అందుకే తోక ముడిచి పేరు మార్చుకున్నారని ఈటల ధ్వజమెత్తారు. కేసీఆర్‌ బానిసలు వందల మంది హుజూరాబాద్ లో నన్ను ఓడగొట్టడనికి పని చేశారన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో కేసీఆర్‌ది కౌరవ పాత్ర అని హుజూరాబాద్  ప్రజల తీర్పు ఇచ్చారు. హుజూరాబాద్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడు కున్నారు. నన్ను కాపాడుకుంటే ప్రజలు కాపాడుతారు.. పోలీసులు కాదు.కాపాడితే మన ధర్మం కాపాడుతుందన్నారు ఈటల. అర్జనునికి పక్షికన్నులా నాకు కనిపించేది కెసిఆర్ నియంతృత్వం, కెసిఆర్ ను ఓడించడం మాత్రమే తెలుసన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండండి. పదవులు వస్తాయి. వచ్చిన వారు ఒదిగి ఉండండి. వైరుధ్యాలు ఉంటాయి. కానీ అవి పార్టీ అంతర్గతంగా ఉండాలి. ఒకరికొకరు గౌరవించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు లేకుండా నాయకులు లేరన్నారు. పదవులు శాశ్వతం కాదు.. పెద్ద మనసుతో పురోగమించాలన్నారు ఈటల