సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు వెల్లడి
చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు కొద్ది సేపటి క్రితం వెలువడ్డాయ్. ఇంటర్ ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు గత నెల రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బోర్డు పరీక్షలు పూర్తై ఫలితాలు వచ్చినా సీబీఎస్ఈ ఫలితాలు ఇప్పటి వరకు రాకపోవడం వల్ల ఇంజినీరింగ్ అడ్మిషన్ల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను విడుదల చేసింది. అయితే పదో తరగతి పరీక్ష ఫలితాలు ముందుగా వస్తాయనుకున్నా… అవి నేటి వరకు రాకపోవడంతో.. విద్యార్థులు ఇంటర్ ఎలా చేరాలి.. ఎక్కడ చేరాలన్నదానిపై తర్జనభర్జనపడుతున్నారు.