జాబ్‌లో జాయిన్ అయిన రోజే మృత్యు ఒడిలోకి
ఒకటి నుంచి 10 …10 నుంచి 15 అక్కడ నుంచి 20….ఇవేవో అంకెలు అనుకునేరు.కాదు తరగతులు.తల్లిదండ్రులు చెమట చుక్కలను వర్షపు ధారలుగా మలిచి చదివించిన తరగతుల మేఘాలు.అవి తమ కలల ఆకాశంలో విస్తరించి సుఖాల వర్షాన్నిస్తాయని…ఆనందపు గాలులు వీచేలా చేస్తాయని కన్న కలలు .కానీ అవి ఒక్కసారిగా తేలిపోయి ఆవిరైపోతే ఎలా ఉంటుందో…ఆ తల్లిదండ్రుల కడుపు కోత వర్షించడానికి కూడా మాటలు రావు.అలాంటి దుర్ఘటన ఈ రోజు హైద్రాబాద్ లో చోటు చేసుకుంది. నార్సింగి లో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఓ యువ ఇంజినీర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.కొత్త గా ఉద్యోగంలో చేరి విధులు ముగించుకుని తాను చేస్తున్న ఉద్యోగం తాలూక తొలి జ్క్షాపకాన్ని మొబైల్‌లో బంధించి తల్లిదండ్రులతో షేర్ చేసుకుని తిరిగి కోకాపేట్ కు చేరుకున్నాడు.ఇంతలో గుర్తు తెలియని వాహనం సినీ ఫక్కీలో ఢీకొట్టడంతో గాల్లో గిరిటీలు కొట్టి నేలపై పడ్డాడు.క్షణాల్లో ఊపరి వదిలాడు.ఈ విషాద ఘటన చూసి కంట తడిపెట్టని వారు లేరు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.గుర్తు తెలియని వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

