రాంబాబూ.. ఒకే ప్రశ్నను ఎన్నిసార్లు అడుగుతావయ్యా?
ఓ బాబూ.. రాంబాబూ.. ఒకే ప్రశ్నను ఎన్నిసార్లు అడుగుతావయ్యా? అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్లకు, వైసీపీ ప్రభుత్వంలో నీలాంటి బఫూన్‌గాళ్లు అడిగే వివరణలకు సమాధానం చెప్పే తీరిక, ఓపిక జనసైనికులకు లేదని, తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అసలే లేదని నాగబాబు స్పష్టం చేశారు.
రంభల రాంబాబు గారూ.. మా సారు త్వరలోనే మీకు సమాధానం చెబుతారు అంటూ సినీ నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేశ్ చురక అంటించారు. అసలింతకీ అంబటి రాంబాబు ఏం అడిగారంటే.. ఏపీలో 175 సీట్లకు పోటీ చేస్తున్నారో.. లేదో.. స్వాంతంత్ర్య దినోత్సవం రోజైనా ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన పవన్ కళ్యాణ్ చేనేత దుస్తులు ధరించారు. దీనిపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. కాటన్ దుస్తుల చాలెంజ్ ఆపాలని.. ఏపీలో ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు. దానికి నాగబాబు, బండ్ల గణేష్ పై విధంగా స్పందించారు.