AIFF (ఏఐఎఫ్‌ఎఫ్)పై FIFA సస్పెన్షన్ వేటు..
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను (ఏఐఎఫ్‌ఎఫ్) తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు FIFA (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్) ప్రకటించింది.
అయితే ఏఐఎఫ్‌ఎఫ్‌లో ఆటకు సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం ఉన్నందున, నిబందనలను ఉల్లంగించిన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిఫా పేర్కొంది. ఈ సస్పెన్షన్ ఆర్డర్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా తెలిపింది. ఈ విషయంపై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. AIFF (ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్) రోజువారీ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణను పునరుద్ధరించే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఫిఫా స్పష్టం చేసింది. ఈ సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ను వేదికగా చేసుకొని జరగవలసిన అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచ కప్ రద్దయ్యింది. ఈ విషయంలో అవసరమైతే తదుపరి చర్యల కోసం ఫిఫా బ్యూరో ఆఫ్ కౌన్సిల్‌కు రిఫర్ చేస్తామని తెలిపింది.