NewsTelangana

ఎమ్మెల్యేకు మరోసారి నోటీసులు

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి 41 సీఆర్‌పీసీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పలు పీఎస్‌లో నమోదైన కేసుల్లో పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. మరోసారి తెలంగాణ పోలీసులు నన్ను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. నాలుగైదు నెలల కింద నమోదైన కేసుల్లో ఇప్పుడు నోలీసులు ఇచ్చారన్నారు.

మరోవైపు.. భవిష్యత్‌లో మరోసారి రాజాసింగ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే అతనిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఇటీవల రాజాసింగ్‌ రిలీజ్‌ చేసిన వీడియో వల్ల ముస్లింల మనోభావాలు కించపర్చరన్నారు. మహ్మద్‌ ప్రవక్త అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో పాత బస్తీలో నిరసనలు మొదలయ్యాయి అని పేర్కొన్నారు. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి రాజాసింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.