రాష్ట్రంలో బీజేపీకి నో ఎంట్రీ : డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. రాష్ట్రంలోకి అడ్డదారుల్లో అక్రమంగా ప్రవేశించి మత చిచ్చురగిల్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీకి, ఆ పార్టీ నేతలకు అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతుండటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పునర్విభజన పేరుతో రాష్ట్రంలో ఎంపీల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీతో ఈపీఎస్ చేతులు కలుపటం భావ్యమేనా అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే దెబ్బకు కూటమి చిత్తుగా ఓడిపోవటం ఖాయమన్నారు. ఈ సభలో మంత్రి పీకే శేఖర్‌బాబు, ఎంపీ దయానిధి మారన్, తదితరులు పాల్గొన్నారు.