ఎన్‌ఎంఆర్ కార్మికుల వేతనాలు 10 శాతం పెరిగాయి
వరంగల్: వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్ కార్మికుల వేతనాలను 10 శాతం పెంచుతున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ రమేష్‌బాబు తెలిపారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఎన్‌ఎంఆర్ వేతనాల పెంపుపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ ఉత్తర్వుల అనంతరం ఈనెల 21 నుండి వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. సమావేశంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్, జెడ్పీసీఈఓ, మిషన్ భగీరథ, ట్రాన్స్‌కో ఈఈలు, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

