NewsTelangana

కోమటిరెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

Share with

తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అంశం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే… పార్టీ మార్పుపై వచ్చిన వార్తలపై మీడియాతో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని కామెంట్‌ చేశారు ఈ వ్యవహారంపై రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమయింది. రాజగోపాల్ రెడ్డి, అమిత్ షాను కలవడం పై పార్టీ అగ్ర నేతల్లో చర్చ జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇలానే ఉపేక్షిస్తే పార్టీకి మరింత డ్యామేజీ జరుగుతోందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం, బీజేపీని బహిరంగంగా పొగుడుతుండటం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని భావిస్తుంది.

ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలో కి దిగారు.రాజగోపాల్‌ రెడ్డి నిన్న తన నివాసంలో ప్రెస్ మీట్ మాట్లాడిన అంశాల క్లిప్పింగ్స్ సేకరించారు. అంతేకాదు నిన్నరాజగోపాల్ రెడ్డి తన నివాసంలో ప్రెస్ మీట్ మాట్లాతూ సోనియాగాంధీని ఈడీ విచారించడంపైనా రియాక్ట్‌ అయ్యారు. సోనియా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. నిన్నటి ప్రెస్‌మీట్‌తో పాటు రాజగోపాల్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు.. వాటికి ఇచ్చిన వివరణల్ని కూడా సేకరిస్తోంది. గతంలో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, సాగర్‌ బై ఎలక్షన్‌పై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వివరణల క్లిప్పింగ్స్‌ కూడా హైకమాండ్‌ సేకరించింది.