న్యూ ఇయర్ వేడుకల వేళ అమెరికాలో అపశృతి
అమెరికాలోని లాస్ వెగాస్‌లో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ హోటల్ ముందు టెస్లా కారులో పేలుడు చోటు సంభవించింది. దీనితో ఒకరు మృతి చెందారు. 7గురు గాయపడ్డారు. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇది ఉగ్రవాద చర్యగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కొన్ని గంటల ముందే న్యూ ఆర్లీన్స్‌లో కొత్త వేడుకల సందర్భంగా ఒక దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ అమెరికాలోని వలసల కారణంగా వస్తున్న నేరస్థుల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అమెరికాలోని క్రైమ్ రేటు పెరిగిపోయిందని పేర్కొన్నాడు. ఈ రెండు ఘటనలకు కారణమైన కార్లను టూర్ రెంటల్ అనే వెబ్‌సైట్ నుండి అద్దెకు తీసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చని మస్క్ ట్వీట్ చేశారు.

