Home Page SliderNational

వరద కారణంగా కొత్త బెడద

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు, సహాయ శిబిరాలకు చేరుకున్నారు. ఇప్పుడు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టి, నీరు తీసేస్తే తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. అయితే వారికి కొత్త బెడద, ప్రమాదం ఎదురుకానున్నాయి. మూడు రోజులుగా వరద నీటిలో ఇళ్లు, కాలనీలు ఉండిపోవడం వల్ల బురద మేటలు వేసింది. వరద కారణంగా కొట్టుకొచ్చిన చెత్తా, చెదారం కారణంగా దోమలు, వానపాములు, తేళ్లు, పాములు వంటి జీవులు ఇళ్లలోకి చేరుకున్నాయి. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా విజృంభించే అవకాశం ఉంది. నీటి మార్పు కారణంగా వైరల్ ఫీవర్లు సోకి, ప్రజలు ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉంది.