జేపీ నడ్డాకు కొత్త బాధ్యతలు
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్టీ కొత్త బాధ్యతలు అప్పజెప్పింది. రాజ్యసభా పక్షనేతగా జేపీ నడ్డాను ప్రకటించింది. ప్రస్తుతం పీయూష్ గోయల్ రాజ్యసభా పక్ష నేతగా ఉండగా ఆయన స్థానంలో జేపీ నడ్డా నియామకం జరిగింది. కేంద్ర వైద్య శాఖా మంత్రిగా కూడా జేపీ నడ్డా పనిచేస్తున్నారు.

