ఈవీఎంలపై సరికొత్త రచ్చ
హర్యానా ఎన్నికల రిజల్ట్ విషయంలో ఈవీఎంలపై మళ్లీ రచ్చ మొదలయిన సంగతి తెలిసిందే. ఈవీఎం ప్యాట్లను మరోసారి లెక్కించాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈసీ నేడు జరగబోయే ప్రెస్‌మీట్‌లో వాటిపై మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు. ఈవీఎంలో ఎలాంటి లోపాలు లేవని, వందశాతం సురక్షితమని బదులిచ్చారు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. నేడు కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు. ఈవీఎంల ఆట ఎక్కడినుండైనా ఆడొచ్చని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలున్న మోదీకి ఇదేం పెద్ద పని కాదన్నారు. ఇజ్రాయెల్ కూడా పేజర్లతో, వాకీటాకీలతో వ్యక్తులను 600 కిలోమీటర్ల దూరం నుండి హతమార్చగలిగినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ పెద్ద కష్టం కాదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

