“లాబీయింగ్ లేకుండా నేషనల్ అవార్డులు రావు!”
జాతీయ అవార్డుల ప్రదానంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లాబీయింగ్ చేసేవారికే నేషనల్ అవార్డులు దక్కుతున్నాయని ఆయన విమర్శించారు. “మమ్ముట్టి లాంటి గొప్ప నటుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందకపోవడం చాలా బాధాకరం. లాబీయింగ్‌తో వచ్చే అవార్డులు నాకు అవసరం లేదు” అని స్పష్టం చేశారు.
కేరళ ఫిలిం అవార్డుల జ్యూరీ చైర్మన్‌గా పనిచేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ — “మొదట నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని చెప్పారు. కానీ తర్వాత జ్యూరీ సభ్యులు జోక్యం చేసుకున్నారు” అని అన్నారు.
ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియా వేదికల్లో వివాదాలకు దారితీశాయి. పలువురు ఆయనకు మద్దతు తెలుపుతుండగా, కొందరు ఆయన వ్యాఖ్యలు జాతీయ అవార్డుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

