రికార్డు సృష్టించనున్న ‘నాసా’ పార్కర్
భానుడిపై పరిశోధనల కోసం నాసా ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్.. పార్కర్ సోలార్ ప్రోబ్ త్వరలో కొత్త రికార్డు సృష్టించనుంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం ఇది సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8మిలియన్ మైళ్ల (6 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి చేరుకుంటుంది.ఇది ఇప్పటి వరకు ప్రయాణించిన రికాక్డుగా నమోదు కానుంది.

