మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేష్
ఏపీ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కల్యాణ్ తర్వాత నారా లోకేష్ ప్రమాణస్వీకారం చేశారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్. చంద్రబాబు నాయుడు కుమారుడు. MLC పదవి ద్వారా పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు IT మరియు కమ్యూనికేషన్ మంత్రిగా కూడా పనిచేశాడు. తాజా ఎన్నికల్లో అదే మంగళగిరి నియోజకవర్గం నుండి 90 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 27 జనవరి 2023న, కుప్పం నుండి ఇచ్ఛాపురం వరకు 4,000 కిలోమీటర్లు నడవడానికి రోడ్-మ్యాప్‌తో 400 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ యువత కోసం లోకేష్ యువ గళం పాదయాత్రను నిర్వహించారు.


