InternationalNationalTrending TodayVideos

నాని న్యూ మూవీ జాన్వీతో నా …?

తెలుగు సినిమాల్లో జాన్వీ కపూర్ తనదైన గుర్తింపు తెచ్చుకుంటుంది. తనదైన అందంతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది ఈ చిన్నది. దేవర మూవీ నుంచి విడుదలైన పాటలే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. దేవర పాటలు నెట్టింట ఫుల్ ట్రెండింగ్‌లో ఉండడంతో, సినిమా రిలీజ్ కాకముందే తెలుగులో జాన్వీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. జాన్వీ ఇండస్ట్రీ కి వచ్చిన 6 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకి పలకరించడానికి రెడీ అవుతోంది . అయితే జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న దేవర సినిమా ఈ అందాల చిన్నది తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బుచ్చిబాబు, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో జాన్వీని హీరోయిన్ గ తీసుకోవాలని మేకర్స్‌ డిసైడ్‌ అయ్యారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి జాన్వీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీ పాటు మరి కొన్ని క్రొత్త సినిమాల కోసం నిర్మాతలు జాన్వీ డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఐతే ఇటీవల నాని ,జాన్వీల సినిమా మీద వస్తున్న వార్తలపై నాని స్పందించారు. ప్రస్తుతం నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు రెడీ ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని ,జాన్వీల మధ్య వస్తున్న కొత్త సినిమా రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. నా తర్వాత చిత్రంలో జాన్వీ నటించనుందనేది కేవలం ఒక రూమర్‌ మాత్రమే. ఒకవేళ ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ రెడీ అవుతోంది. నేను కొన్ని రోజులుగా మూవీ ప్రొమోషన్ కారణంగా బిజీగా ఉన్నాను. ఒకవేళ కొత్త సినిమా కథ ఆమె కూడా నచ్చితే ఫ్యూచర్‌లో తీసే అవకాశం రావొచ్చని చెప్పారు.