మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి నల్లారి
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మాజీ సీఎంకు చిత్తూరు జిల్లా కలికిరిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. త్వరలోనే వస్తా… అందరినీ కలుస్తా అంటూ భరోసా ఇవ్వడంతో.. రండి బాబు రండి అంటూ పార్టీ నేతలు విజ్ఞప్తులు చేశారు. చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిరణ్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన నల్లారి… పార్టీ పెద్దలతో ఏపీ రాజకీయాలపై చర్చించారు… పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక నేతగా ఉన్న నల్లారిని… పార్టీ కష్ట కాలంలోనూ యాక్టివ్ గా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా కోరినట్టు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగితే ఏపీ కాంగ్రెస్‌లో ఉత్తేజం వస్తోందన్న భావనలో పార్టీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత బయటకు కన్పించడం దాదాపు మానేశారు. జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టినా… ఎన్నికల్లో ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత ఆయన రాజకీయాల గురించి మాట్లాడింది చాలా తక్కువే. గత ఎన్నికల్లో సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు.