NewsTelangana

అమిత్ షాతో కోమటిరెడ్డి మాటామంతి..!

Share with

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి.. హోం మంత్రి అమిత్ షాను కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ తీరుతో గత కొంత కాలంగా గుస్సాగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి… కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం చర్చనీయాంశమయ్యింది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటూ ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ని ఓడించే పార్టీ నుండే పోటీ చేస్తా ఆ వివరాలు తొందరలోనే వెల్లడిస్తానన్నారు.