విమానానికి సాంకేతిక లోపం, ఆలస్యంగా కరీంనగర్ చేరుకున్న జేపీ నడ్డా
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాన్ని కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. టేకాఫ్ సమయంలో విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో విద్యానగర్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. షెడ్యూల్ ప్రకారం నడ్డా మధ్యాహ్నం 2.10 గంటలకే శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకోవాల్సివుంది. సాంకేతిక లోపం కారణంగా ఆయన రావడం కొంత ఆలస్యం అయ్యింది. కరీంనగర్‌లో జరిగే ఐదోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు సాయంత్రం 5.45 గంటలకు నడ్డా హాజరయ్యారు.

