నా టార్గెట్ మోదీ..
తన టార్గెట్ మోదీ అని, భారత్ ను నాశనం చేస్తానని జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజహర్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ పై తనకు భయం లేదు.. నిరాశ లేదు. ..తన ఫ్యామిలీ చనిపోయినందుకు విచారం లేదని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమయ్యింది. ఆపరేషన్ సిందూర్ మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో మసూద్ అజహార్ సోదరి,బావ,మేనల్లుడు సైతం ఉన్నారు.

