నా ప్రత్యేక రక్షాబంధన్..నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాఖీని చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో అక్కడ పని చేసే సిబ్బంది చిన్నారులతో ఈ వేడుకను జరుపుకున్నారు. ఆయనకు రాఖీ కట్టిన పిల్లలంతా అక్కడ పని చేసే పీఎంవో ఆఫీస్ అధికారుల కుటుంబ సభ్యులే. అంతా కాదు పీఎంవోలో పని చేసే స్వీపర్లు , ప్యూన్లు , గార్డెన్ సిబ్బంది , డ్రైవర్లు ఇతర సిబ్బందికి సంబంధించిన వారు కావడం విశేషం.
దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్న మోదీ “ ఈ చిన్నారులతో నా ప్రత్యేక రక్షా బంధన్ ” అని రాసుకొచ్చారు. రాఖీ కట్టించుకున్న అనంతరం మోదీ కాసేపు వారితో ముచ్చటించి , వారిని ఆశీర్వదించారు. ప్రధానికి రాఖీ కడుతున్న వీడియోని బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి “ ఈ దేశాన్ని రక్షిస్తారన్న నమ్మకంతో కడుతున్న రాఖీ ఇది ” అని రాసుకొచ్చారు.