InternationalNewsNews Alert

అయ్యబాబోయ్… ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు కరోనా

Share with

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 2 సంవత్సరాల పాటు యావత్ ప్రపంచం అల్లాడిన విషయం  అందరికీ తెలిసిందే. అటువంటి నేపథ్యంలో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉన్న ఒకే ఒక్క దేశంగా ఉత్తర కొరియా నిలిచింది. కానీ ఇటీవల కాలంలో కరోనా ఆ దేశాన్ని కూడా తాకింది. దీంతో ఒక్కసారిగా ఉత్తర కొరియా ప్రజలంతా జ్వరాల బారిన పడ్డారు.ఈ క్రమంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ కూడా అనారోగ్యం పాలయ్యారని ఆయన సోదరి కిమ్ యో జోంగ్ తాజాగా వెల్లడించారు. కానీ కిమ్ అనారోగ్యం పాలవ్వటానికి కారణం ఎంటో ఆమె స్పష్టం చేయలేదు.

కిమ్ అనారోగ్యం గురించి ఆమె ఓ ప్రసంగంలో తెలిపారని ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. జ్వరం కారణంగా తన సోదరుడు కిమ్ జోన్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారన్నారు.అయినప్పటికీ ఆయనకి ఉత్తర కొరియా ప్రజల క్షేమం పట్ల  ఉన్న శ్రద్ధ కారణంగా ఆయన ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. అయితే ఆయన ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారన్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దక్షిణ కొరియాపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. దక్షిణ కొరియా కీలు బొమ్మలు బెలూన్ల ద్వారా తమ దేశ సరిహద్దుల్లోకి విషవాయువులను పంపిచారన్నారు. అందువల్లే ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విజృంభించిందన్నారు. ఇలాంటివి మళ్లీ జరిగితే దక్షిణ కొరియా అధికార యంత్రాంగం అంతు చూస్తామని కిమ్ జో యోంగ్ హెచ్చరించారు.