మునుగోడు యుద్ధం..నెగ్గేదెవరు?
మునుగోడు ఉపఎన్నిక తెలంగాణాలోని అన్నీ పార్టీలకు కత్తి మీద సాములా మారిందనే చెప్పాలి. అధికార,ప్రతిపక్షాలు మునుగోడులో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా పార్టీలన్నీ తమ ప్రత్యర్థులతో తలపడడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్,టీఆర్ఎస్ ,బీజేపీ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై ఒక రేంజ్‌లో విరుచుకుపడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే భారీ ర్యాలీలు నిర్వహించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ.. ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. దీంతో మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో యుద్ధవాతావరణాన్ని నెలకొల్పాయనే చెప్పాలి. తెలంగాణాలోని అన్నీ పార్టీలు కూడా ఈ ఉపఎన్నికలలో మాదే పైచేయి అనే ధీమా వ్యక్తం చేసున్నాయి. మరి ఈ మునుగోడు ఉపఎన్నికల భీకర రాజకీయ రణరంగంలో గెలిచేదెవరో..? ఓడేదెవరో..? వేచి చూడాల్సివుంది.

