Home Page SliderTelangana

ఇదంతా మోడీ, షాల కోసమేనా..

‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ఆమోదించింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై పలువురు విపక్ష నేతలు ఇది అచరణాత్మకం కాదని అన్నారు. కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. దేశంలోని ఫెడరలిజాన్ని నాశనం చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని రాజీపడేలా చేయడం వల్లే తాను ఒకే దేశం – ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తున్నానని అసదుద్దీన్ అన్నారు. బహుళ ఎన్నికలు మోడీ, షాలకు తప్ప ఎవరికీ ఇబ్బంది కాదని అన్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నందున ఇలా చేస్తున్నారు. సక్రమంగా, ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య జవాబుదారీతనం కూడా మెరుగుపడుతుందని ఎక్స్ వేదికగా తెలిపారు.