ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రుల ములాఖత్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉంటున్నారు. కాగా ఈ రోజు తెలంగాణా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,సత్యవతి రాథోడ్ తీహార్ జైలుకు చేరుకొని కవితను పరామర్శించారు. ఇవాళ ఉదయం మాజీ మంత్రులు ములాఖత్‌లో కవితను కలుసుకొని ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలని వారు కవితకు సూచించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

