Andhra PradeshNews

ట్రిబుల్ ఆర్‌కు కష్టాలు

Share with

ఎంపీ రఘురామ కృష్ణరాజు పై సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసు నమోదు అయ్యింది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను ఇంట్లో నిర్బంధించారన్న ఫిర్యాదుతో పోలీసులు ఎంపీ రఘురామరాజు, ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి సహా మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కేసు నమోదైంది. ప్రధాని భద్రతలో భాగంగా విధుల్లో ఉండగా దాడి చేశారని పీసీ బాషా ఫిర్యాదు చేశాడు. 3 గంటలపాటు ఎంపీ ఇంట్లో నిర్భందించి.. చితకబాదారన్నారు. రఘురామ కృష్ణ రాజుతోసహా ఐదుగురు దాడికి పాల్పడ్డారని కంప్లైంట్లో పేర్కొన్నారు. అందరు చూస్తుండగా మీడియా సమక్షంలోనే దాడిచేశారని బాషా వాపోయాడు. ISB వద్ద నుండి 7777 కార్ లో వచ్చి బలవంతంగా లాక్కెల్లారన్నాడు. ఇంటెలిజెన్స్ అని చెప్పినా… పట్టించుకోలేదని బాషా ఆవేదన వ్యక్తం చేశాడు. ఐడి కార్డ్, పర్స్ లాక్కొని విడతలవారిగా హింసించారన్నాడు. ఎంపీతో సహా నలుగురు లాటీలతో కొట్టి బూతులు తిట్టారని… ఆక్రోశం వెళ్లగక్కాడు.

A1 ఎంపీ రఘురామ కృష్ణ రాజు
A2 భరత్ S/o రఘురామ కృష్ణరాజు
A3 సందీప్, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్
A4 ASI, సీఆర్పీఎఫ్
A5 శాస్త్రి, రఘురామ పీఏ

ఐతే అంతకు ముందు… ఎంపీ రఘురామ నివాసంలోకి ప్రవేశించి ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆ వ్యక్తిని  దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించామంటున్నారు ట్రిబుల్ ఆర్. ఎంపీ నివాసం వద్ద అనుమానాస్పద వ్యక్తిని గమనించి… పోలీసులకు సమాచారం ఇచ్చామని ఎంపీ పీఏ శాస్త్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు వైపుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా విచారణ చేస్తున్నట్టు గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ చెప్పారు.

హైదరాబాద్‌లో తన నివాసం వద్ద జరుగుతున్న రెక్కీ నిర్వహణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.