NewsTelangana

విష్ణు లంచ్… సీనియర్లు పంచ్…

Share with

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికమని నేతలు ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. నోటికి అడ్డూ, అదుపు లేకుండా… ఎవరిని ఏమైనా అనడం కాంగ్రెస్ పార్టీ నేతలకు బాగా అలవాటైన పని. పీసీసీ చీఫ్ పలానా పని చేయొద్దంటే ఎందుకు చేయొద్దని ప్రశ్నించే నేతలు చాలా మందే ఉంటారు. మాకు హైకమాండ్ సోనియమ్మ, రాహుల్ అంటూ మాట కలిపిసి.. పార్టీ పరువు గంగలో కలుపుతుంటారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత నేత పీజేఆర్ తనయుడు… మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందు సమావేశానికి వస్తామని చెప్పి నేతలు హ్యాండిచ్చారు. హైదరాబాద్ దోమలగూడలో ఏర్పాటు చేసిన విందుకు సీనియర్లు ఎవరూ రాలేదు. కాంగ్రెస్ పార్టీలో లొల్లి నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్లు వస్తారని అందరూ భావించారు. రేవంత్ ఏం చేశారో… ఏమో గానీ ఒక్కరంటే ఒక్క నేత కూడా హాజరుకాలేదు. సీనియర్లతో గ్యాప్ వచ్చిందని… అందరితో కలిసిపోదామనే లంచ్‌కు ఆహ్వానించానని చెప్పారు విష్ణు. వీహెచ్, మధుయాష్కీ, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు.. వస్తామని చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి… ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఆహ్వానించలేదన్నారు. సీఎల్పీ నేత భట్టి సాయంత్రం వస్తానని చెప్పారన్నారు విష్ణు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే విష్ణు విందు సమావేశానికి నేతలు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది.