అల్లూరికి ప్రధాని మోదీ వీడియో నీరాజనం
అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల హైలైట్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో జరిగిన అల్లూరి 125వ జయంతి ఉత్సవాల వేడుక మధురానుభూతి కలిగించిందన్నారు. అల్లూరి సీతారామరాజు స్మరించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పిన మోదీ… ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జయంతి వేడుకల వీడియోను ప్రజలతో పంచుకున్నారు. ముఖ్యాంశాలను వివరిస్తూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు ప్రధాని మోదీ.