NewsTelangana

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం-అమిత్ షా

Share with

బిజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు హోం మంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని… వచ్చే రోజుల్లో
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో కూడా అధికారంలోకి వస్తామన్నారు అమిత్ షా. రాజకీయాలను సేవ కోసం వినియోగిస్తామన్నారు. బీజేపీ తీసుకున్న అన్ని నిర్ణయాలపై కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతోందని షా విమర్శించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని… కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతుందని ఆరోపించారు. రాష్ట్ర పతి ఎన్నికలో గతంలో దళితునికి అవకాశం ఇచ్చామని… ఇప్పుడు గిరిజన, ఆదివాసీ మహిళకు అవకాశం కల్పించామన్నారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సాలో ఈసారి బీజేపీ జెండా ఎగురేస్తామన్నారు షా