ఫిరోజ్ ఖాన్‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 90 లక్షల ఓట్లు వస్తాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నాంపల్లి ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆయన కొంపముంచాయి. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… పీసీసీ అంచనాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని… ఆయనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపించింది. పార్టీ శ్రేణుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తప్పుబట్టింది .ఈ మేరకు ఫిరోజ్ ఖాన్‌కు షో కాజ్ నోటీసులు జారీ చేసి 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నా రెడ్డి స్పష్టం చేశారు.
Read More: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు