అత్యాచార కేసులో ఎంపీ అరెస్ట్
అత్యాచారం ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ అరెస్టు అయ్యారు. గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూండగా అరెస్టు చేసినట్లు సమాచారం. రాథోడ్ యూపీలోని సీతాపూర్ నియోజకవర్గానికి చెందినవారు. ఒక మహిళ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఆమె ఫిర్యాదులో ఎంపీ తనను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి, పలుమార్లు అత్యాచారం చేశారని, ఫోన్ కాల్స్, రికార్డింగ్స్ ఆధారాలుగా చూపింది. దీనితో ఎంపీకి ముందస్తు బెయిల్ నిరాకరించింది కోర్టు.

