National

 నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Share with

ఈ రోజు నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.ఈ సమావేశాలలో కేంద్రం కొన్ని కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది.వీటిలో ప్రధానంగా కంటోన్మెంట్ బిల్లు ,మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సోసైటీస్ బిల్లుతో సహా మరో 24 బిల్లులు ఉండనున్నాయి.అయితే ఈ సమావేశాలు 18 రోజులు అంటే మొత్తం 108 గంటల పాటు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది.ఈ  సమావేశాలకు సంబంధించి ఇటీవల పార్లమెంటులో మాట్లాడే మాటలు ,విధి విధానాలపై లోక్‌సభ సెక్రటేరియట్ కొన్ని నిషేదాలను విధించింది.అయితే ఈ సమావేశాలలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయని వారు సమావేశాలకు ముందు నిర్వహిస్తున్న పలు చర్చల ద్వారా అర్ధమవుతుంది అని చెప్పవచ్చు.

 కంటోన్మెంట్ బిల్లు, మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్లు, దివాలా చట్ట సవరణ బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయ్. కంటోన్మెంట్లను మున్సిపాలిటీతో సమానంగా అభివృద్ధి చేసేలా, ఈజ్ ఆఫ్ లివింగ్ పెంచేలా… కంటోన్మెంట్ బిల్లు రూపకల్పన చేశారు. మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వ పాత్రను హేతుబద్ధీకరణ చేయడం, అభివృద్ధి ప్రగతి దిశగా ప్రజల్లో విశ్వాసం తీసుకొచ్చేలా మార్పులు చేస్తారు. దివాలా కోడ్ సవరణ బిల్లు ద్వారా నిర్ణీత వ్యవధిలో దివాలా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు. ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్ -2022 ద్వారా డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌కు రిజిస్ట్రేషన్, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ నియామించాలని కేంద్రం యోచిస్తోంది. ఇవి కాకుండా అనేక బిల్లులు వర్షాకాల సమావేశంలో ఆమోదం పొందనున్నాయ్.