NewsTelangana

మునుగోడు ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో

మునుగోడు ఉప ఎన్నిక కొత్త రిటర్నింగ్‌ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌ సింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఓ అభ్యర్థికి రోడ్డు రోలర్‌ గుర్తును నిబంధనలకు విరుద్ధంగా మార్చినందున రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుపై ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. తనకు తొలుత కేటాయించిన రోడ్డు రోలర్‌ గుర్తు స్థానంలో బేబీ వాకర్‌ గుర్తు కేటాయించారంటూ సీఈసీకి యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్‌ గుర్తును శివకుమార్‌కు మళ్లీ కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.