కాబోయే సీఎంను కాకాపడుతున్న ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం కేటీఆర్ అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి సంచలన వాఖ్యలు చేశారు..కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా జనగామ జిల్లా చిల్పూర్ వేంకటేశ్వరాలయంలో మంత్రి ఎరబెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే రాజయ్య మొకాళ్లపై మెట్లెక్కి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం కరుణాపురం స్టేజి వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా అధికారులు,ప్రజాపతినిధులతో కలిసి మొక్కలు నాటారు.ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఐటీ, టెక్స్‌టైల్‌పార్క్ ఏర్పాటు చేశారన్నారు.ఈ సందర్బంగా మంత్రి ఎరబెల్లి దయాకర్ మాట్లాడుతూ కేసీఆర్ దేశ్‌కీ నేత అని,రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని వాఖ్యనించారు.