NewsTelangana

కేసీఆర్ అనుకున్నట్టుగానే అవుతోంది…!

Share with

మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుడుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ ఆ పార్టీ నేతలు తేల్చిచెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డిపై పోటీకి కూసుకుంట్లను నిలబడితే పార్టీకి రాజీనామా చేస్తామంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన నేతలు.. మంత్రి జగదీష్ రెడ్డికి అసలు విషయం చెప్పేశారు. మునుగోడు ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించినప్పటికీ కూసుకంట్ల విషయంలో మరో ఛాన్స్ తీసుకోవద్దని హెచ్చరించారు. బుజ్జగింపులతో తలొగ్గమని తేల్చేశారు. తాజాగా మునుగోడుకు చెందిన పలువురు టీఆర్ఎస్ జడ్పీటీసీలు, సర్పంచ్‌‍లు, కార్యకర్తలతోపాటు, మాజీ ప్రజాప్రతినిధులు ఇందుకు సంబంధించి ఓ తీర్మానం చేశారు. ఒకవేళ కూసుకుంట్లకు టికెట్ ఇవ్వాలనుకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ఉపఎన్నికల్లో కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పార్టీ చిత్తుగా ఓడుతుందని హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తున్న మూడు పార్టీలు… మునుగోడులో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్న తరుణంలో.. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులెవరన్నదానిపై ఉత్కంఠ రేగుతోంది.