విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యంలో మైక్రోసాఫ్ట్ శిక్షణ
విద్యార్ధులకు ఉత్తమ నైపుణ్యాలు అందించడానికి ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. ఉద్యోగాలకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించడానికి 1.62 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ కోర్సులే కాకుండా లింక్డిన్‌తో కూడా అనుసంధానం చేసి టెక్నాలజి, క్రియేటివిటీ, బిజినెస్ విభాగాలలో 8వేలకు పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. శిక్షణ పొందే విద్యార్థికి మైక్రోసాఫ్ట్ సంస్థ 100 డాలర్ల విలువైన ఓచర్లను కూడా అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అందించే కోర్సులతో పాటుగా ఇతర కోర్సులకోసం ల్యాబ్‌ల కోసం దీనిని విద్యార్థులు వినియోగించుకోవచ్చు.

అజూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ మెషిన్స్, SQL డేటాబేస్, యాప్స్ బిల్డింగ్, వంటి కోర్సులు కూడా చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం గత ఏడాది మొదలుపెట్టారు. దీనిలో ఇప్పటికే 35,980 మందికి శిక్షణ పూర్తయ్యింది. మిగిలిన వారికి కూడా తొందరలోనే ఈ అక్టోబర్ నాటికి పూర్తిచేయబోతున్నారు. ఈ కోర్సులకు దాదాపు ఒక్కొక్కరికీ 25 వేల నుండి 50 వేలు ఖర్చు అవుతుంది. ఈ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. రేపు విశాఖలో శిక్షణ పూర్తి చేసిన వారికి సీయం జగన్ చేతులమీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు.

