IPL చరిత్రలోనే చెత్త రికార్డు క్రియేట్ చేసిన MI కెప్టెన్
ఈ IPL సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. కాగా ఈ సీజన్‌లో జట్టులన్నీ IPL ట్రోఫీని దక్కించుకునేందుకు పోటా పోటీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ CSK Vs MI టీమ్‌లు బరిలోకి దిగాయి. కాగా ఈ మ్యాచ్‌లో CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు MI స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ జ్వరం కారణంగా దూరమయిన విషయం తెలిసిందే. మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికే MI కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో MI టీమ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం MI టీమ్ చేసిన 14 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో MI కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి డకౌట్ అవడంతో IPL చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును ఆయన మూటకట్టుకున్నారు. దీంతో రోహిత్ శర్మ IPL లో ఇప్పటి వరకు 16 సార్లు డకౌట్ అయ్యారు.

