మెట్రోను నగర శివార్లకూ విస్తరించాలి
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మరిన్ని డిమాండ్లు ముందుకొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని.. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని.. అప్పుడు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో రైలును విస్తరించుకుందామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రానున్న కాలంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలకూ విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.
మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలివే..
బీహెచ్‌ఈఎల్ నుంచి పటాన్‌చెరు (9.9 కి.మీ.)
ఎల్బీ నగర్ నుంచి చంద్రాయణ గుట్ట (9.1 కి.మీ.)
ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం (16.6 కి.మీ.)
ఎంజీబీఎస్ నుంచి ఘట్‌కేసర్ (23.2 కి.మీ.)
జేబీఎస్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ (9.6 కి.మీ.)
బోయిన్‌పల్లి నుంచి మేడ్చల్ (19 కి.మీ.)
ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ (15.9 కి.మీ.)
బీహెచ్‌ఈఎల్ నుంచి దమ్మాయిగూడ (37.2 కి.మీ.)
తార్నాక నుంచి కీసర ఓఆర్‌ఆర్ (19.6 కి.మీ.)
చాంద్రాయణ గుట్ట నుంచి రేతిబౌలి (16.1 కి.మీ.)
నానక్‌రాం గూడ నుంచి బీహెచ్‌ఈఎల్ (13.7 కి.మీ.)

