తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరుగుతున్నాయి. ఏకంగా 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.
విపత్తుల నిర్వహణశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్. హరీష్‌కు రవాణా, ఆర్ అండ్ బీ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
మార్కెటింగ్ శాఖ డైరక్టర్‌గా ఉదయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక
హాకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి
రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా వికాస్ రాజ్ బదిలీ అయ్యారు.