News

బీజేపీలో భారీగా రాష్ట్ర అధ్యక్షుల మార్పులు

దేశవ్యాప్తంగా బీజేపీ కార్యవర్గంలో భారీ మార్పులు చేపట్టింది బీజేపీ హైకమాండ్. మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరో రెండు రాష్ట్రాలైన జార్ఖండ్‌లో,పంజాబ్‌లలో కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులను మార్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా సోము వీర్రాజును తొలగించి దగ్గుబాటి పురంధరేశ్వరిని నియమించారు. అలాగే తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈటల రాజేందర్‌ను ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఇప్పటివరకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్‌కు ఏం పదవి ఇస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. అలాగే జాతీయ కార్యవర్గంలోకి ఈమధ్యనే పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని, తాను కార్యకర్తలా పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానని, తెలంగాణప్రజల అంతరంగం గురించి, ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తనకు బాగా తెలుసని, కీలక బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇక పంజాబ్ బీజేపీ అధ్యక్షునిగా సునీల్ జక్కర్, జార్ఖండ్ ఛీప్‌గా బాబూలాల్ మరాండీలను నియమించారు.