చత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం
దండకారణ్యంలోకాల్పుల మోత,మందుపాతరల విధ్వసం కొనసాగుతూనే ఉంది.గత ఏడాది లో జవానులు,మవోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు.ఇందులో సామాన్యులు కూడా ఇన్ఫార్మర్ల పేరుతో బలయ్యారు.తాజాగా సోమవారం నాడు భద్రతా బలగాల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతర పెట్టి పేల్చేశారు.బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 10 మంది సైనికులు వీరమరణం పొందారు.కూంబింగ్‌కి వెళ్తున్న సిబ్బంది,అధికారులను పథకం ప్రకారం మావోలు మట్టుబెట్టారు. సైనికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రం అయ్యాయి.విషయం తెలుసుకున్న ఐజి ఎస్పీజీలతో బీజాపూర్‌కి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.మృతదేహాలను అడవి నుంచి తెప్పించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

