Andhra PradeshHome Page Slider

చల్లని సముద్రగర్భంలో కలిసిన గత చిహ్నాలెన్నో!

కాకినాడ: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో నాలుగైదు రోజులుగా సముద్ర జలాలు చాలా దూరం వెనక్కి వెళ్తున్నాయి. దీంతో కడలి గర్భంలో కలిసిపోయిన కట్టడాలు బయటపడుతున్నాయి. మూడేళ్ల కిందట తుపాను సమయంలో ఇక్కడ కొన్ని ఇళ్లతోపాటు ఆలయాలు, ఇతర కట్టడాలు ముంపుకు గురయ్యాయి. శుక్రవారం జలాలు సుమారు 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో రామాలయ శిథిలాలు, వాడుక నీటిబావి బయటపడ్డాయి.