చంద్రబాబుకు మద్దతుగా లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కాగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు,నిరసనలు చేపడుతున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ ఏపీలోనే కాదు తెలంగాణాలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా తెలంగాణాలోని ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఐటీ ఉద్యోగులు లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరుతో మరోసారి నిరసన చేపట్టనున్నారు. కాగా ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం 10:30 నుంచి 11:30 గంటలకు మెట్రోలో ప్రయాణించనున్నారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నల్ల షర్టులు ధరించి ఐటీ ఉద్యోగులు మెట్రోలో ప్రయాణించనున్నారు. దీంతో పోలీసులు మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకుని మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ అభిమానులు మెట్రో అధికారులతో వాగ్వాదానికి దిగారు.దీంతో ప్రస్తుతం మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.