ఓటర్ లిస్ట్ ఫామ్ స్వయంగా స్వీకరించిన మమతా బెనర్జీ
SIR ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన రెండో రోజే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఓటర్ లిస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్ అందుకున్నారు. కోల్‌కతాలోని సీఎం నివాసానికి నిన్న బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) చేరుకున్నారు.
ఫామ్‌ను నేరుగా మమతకే అందజేస్తానని ఆయన సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో, స్వయంగా మమతా బెనర్జీ బయటకు వచ్చి ఫామ్‌ను స్వీకరించినట్లు సమాచారం. ఆమె దాన్ని పూరించిన తర్వాత తిరిగి BLOకు అందజేయనున్నట్లు తెలిసింది.
ఇదే సమయంలో SIR ప్రాజెక్టుపై మమతా బెనర్జీ పోరాటం కొనసాగుతోంది. రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఆమె మళ్లీ ఆరోపించారు.

