Home Page SliderTelangana

క్షత్రియ ఆత్మీయ సమావేశంలో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. రాజులు సమాజంపై చెరగని ముద్ర వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఈటల కీలక వ్యాఖ్యాలు చేశారు.

దశాబ్దాలుగా క్షత్రియులతో సన్నిహిత సంబంధాలున్నాయ్..
కుటుంబ సంబంధాల కంటే వర్గ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా…
మల్కాజ్‌గిరి ప్రాంతంలో పచ్చని తోటల అలరారేలా చేశారు క్షత్రియులు, మా రాజులు.
ఉద్యమకాలం నాటి నుంచే రాజులతో పరిచయం ఉంది.
ఈ ప్రాంతానికి సంస్కృతిని, సంప్రదాయాన్ని మానవ సంప్రదాయాన్ని అందించారు.
ఎవరితో ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవించేవారిలో క్షత్రియులు ముందుంటారు.
30 ఏళ్ల క్రితం సభలు పెట్టుకునేందుకు అవకాశమిచ్చారు.
సాధ్యం కాని వ్యాపారాల్లోనూ సత్తా చాటిన వారు క్షత్రియులు
ప్రయోజనం ఆశించకుండా నమ్మిన మిత్రుల కోసం సాయం చేసేవారు రాజులు
ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న నాలుగో జనరేషన్ ఇప్పుడు కీలకంగా ఉంది
రాజులు ఎంత మంది ఉన్నారన్నదానిది కాదు… ఎంత ఎక్కువ ప్రభావం చూపిస్తారో అందరికీ తెలుసు
లక్షల మందిని ప్రభావం చూపగల సమాజం క్షత్రియజాతి. రాజులు చెప్తే ఎవరైన వింటారు.
కమ్యూనికేట్ చేసే స్కిల్స్ క్షత్రియలకు మెండుగా ఉన్నాయ్.


ఎన్నికలకు 30-40 రోజులు మాత్రమే సమయం ఉంది. నిండు మనసుతో ఆశీర్వదించండి.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా డబ్బులు అవసరమయ్యేవి కావు.. డబ్బును నమ్ముకొని ఎప్పుడూ ఎన్నికల్లో కొట్లాడలేదు.
ధర్మాన్ని నమ్ముకున్నోడిని…
2021లో మొదటిసారి డబ్బు ప్రభావం రాజకీయాల్లో స్పష్టంగా చూశా.
ప్రజల ఆశీర్వాదం మార్కెట్‌లో కొనుక్కుంటే రాదు… ప్రజలిస్తేనే వస్తుంది
అధికారాన్ని ధర్మానికి ఉపయోగించా…
కోళ్ల ఫార్మ్‌లో డబ్బులు సంపాదించమంటే జోగిని బతుకులాంటిది..
ఎంతకష్టమో మనందరికీ తెలుసు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే వ్యాపారం… ఎన్ని కష్టాలుపడితే తప్ప లాభాలు రావు.
1992లో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నా. ఎన్నడూ అక్రమాలు చేయలా…
మీ రాజేందర్ అప్పుడూ అలాగే ఉన్నాడు.. ఇప్పుడూ ఇలాగే ఉంటాడు… మచ్చ తీసుకురాడు..
కులంతో సంబంధం లేకుండా, రక్త సంబంధం లేకుండా వర్గ సంబంధమే మిన్న అని నిరూపించినవారు క్షత్రియులు
22 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు ఎవరూ శత్రువులు లేరు.
రాజకీయలంటే హింసించడమనుకోలేదు… పదవులను ఎలా పడితే అలా వాడలేదు…